Wednesday, 1 April 2026
  • Home  
  • ఖాతాకు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
- ఆదిలాబాదు

ఖాతాకు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి

ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా రీజినల్ మేనేజర్ రామచందర్ రావు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, ఖాతాకు కేవైసీ చేసుకోవాలని, నామినీలను పెట్టాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ మోసాలపై అప్రపత్తంగా ఉండాలని, ఇలాంటి అనుమానం ఉన్న1930కు ఫిర్యాదు చేయాలన్నారు. డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఎంఎస్ఎంఈ లోన్స్ ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు అన్నారు. వినియోగదారులు మరణిస్తే వారి కుటుంబీకులు బ్యాంకు ను సంప్రదించి నిబంధనల ప్రకారం వచ్చే లబ్ధి పొందాలని తెలిపారు. బీమా, పెన్షన్ పథకాలతో కుటుంబాలకు ధీమా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్బిఐ ఎఫ్ఐ మేనేజర్ విజయ్, ఎంఎస్ఎంఈ డిఎం పృథ్వి, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, సత్యనారాయణ, కార్యదర్శి వినోద్, శ్రీనివాస్, దత్తు, అరుణ్, రాజశేఖర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.