Thursday, 5 February 2026
  • Home  
  • ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్థాఫర్) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, రాజకీయ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, తుమ్మల క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ రాదోడ్, పోతుల వీర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 53వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి ధనియాకుల శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ ప్రతినిధి అన్నం శ్రీనివాస్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, పిల్లల మర్రి వెంకట్, అల్లిక అంజయ్యలతో పాటు రెండవ పట్టణ బాధ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తెలుగుదేశం, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం జనవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా స్థాఫర్)

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, రాజకీయ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.

ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, తుమ్మల క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ రాదోడ్, పోతుల వీర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

53వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి ధనియాకుల శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ ప్రతినిధి అన్నం శ్రీనివాస్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, పిల్లల మర్రి వెంకట్, అల్లిక అంజయ్యలతో పాటు రెండవ పట్టణ బాధ్యులు పాల్గొన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తెలుగుదేశం, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.