పున్నమి ప్రతి నిధి
బీసీ రిజర్వేషన్ల పెంపు, రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా కొనసాగింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బంద్ కు బీజేపీ, వివిధ బీసీ సంఘాలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు విశేషంగా మద్దతు తెలిపారు.
వైరా, సత్తుపల్లి, ఖమ్మం, మధిర పాలేరు నియోజకవర్గ ప్రాంతాల్లో బంద్ కి విస్తృత ప్రజా మద్దతు లభించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే సత్తుపల్లి పట్టణంలో బంద్ సందర్భంగా బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బంద్ నేతలు హెచ్చరించారు. మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.


