Sunday, 7 December 2025
  • Home  
  • ఖమ్మం జిల్లా లో బీజేపీ జెండా ఎగురవేయాలి. బిజెపి రాష్ట్ర నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు :బీజేపీ జిల్లా నూతన కమిటీ కి అభినందనలు
- ఖమ్మం

ఖమ్మం జిల్లా లో బీజేపీ జెండా ఎగురవేయాలి. బిజెపి రాష్ట్ర నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు :బీజేపీ జిల్లా నూతన కమిటీ కి అభినందనలు

పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు గారు నూతన పదాధికారులను అభినందిస్తూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నూతన కమిటీదేనని పేర్కొన్నారు. ప్రజలతో సమీపంగా ఉండి, బీజేపీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేర్చాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి మండలంలో బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని గోంగూర వెంకటేశ్వర్లు గారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు శ్రీదేవి, టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ, నాయకులు రవి గౌడ్, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ సారధ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ మరింత శక్తివంతమవుతుందని, ప్రజల విశ్వాసం గెలుచుకుంటుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

పున్నమి ప్రతి నిధి

ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు గోంగూర వెంకటేశ్వర్లు గారు నూతన పదాధికారులను అభినందిస్తూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత నూతన కమిటీదేనని పేర్కొన్నారు. ప్రజలతో సమీపంగా ఉండి, బీజేపీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ చేర్చాలని సూచించారు.

జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సారథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి మండలంలో బీజేపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని గోంగూర వెంకటేశ్వర్లు గారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు శ్రీదేవి, టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ, నాయకులు రవి గౌడ్, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ సారధ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ మరింత శక్తివంతమవుతుందని, ప్రజల విశ్వాసం గెలుచుకుంటుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.