ఖమ్మం, మార్చి:
( పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రూ.196 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించింది. బుధవారం మేయర్ పూనుకోల్లు నీరజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి బడ్జెట్ వివరాలను వెల్లడించారు.
నగర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, చెత్త సేకరణ వంటి పౌర సేవలను మరింత మెరుగుపరచడంపై దృష్టి సారించారు.
ఈ బడ్జెట్ ద్వారా నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్పొరేషన్ కృషి చేయనుంది.


