క్షత్రియ
క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేద్దాం..
క్షత్రియ సంఘం నాయకుడు సంగ రాజు రవికుమార్ రాజు.
అన్నమయ్య జిల్లా నవంబర్ 8 (నవ్యాంధ్ర వార్తాపత్రిక ): రాజంపేటలోని పలపత్తూరు గ్రామం నందు జరుపబోయే క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని రైల్వేకోడూరు నియోజకవర్గ క్షత్రియ నాయకులు పిలుపునిచ్చారు. రైల్వే కోడూరు పట్టణంలోని రాఘవ రాజా పురం రవికుమార్ రాజు నర్సరీ నందు క్షత్రియ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంగ రాజు రవికుమార్ రాజు, ఓబులవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు గంగరాజు వెంకటేశ్వరరాజు, కంచిరాజు రామరాజు తదితరులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి రథసారథి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా హాజరు కాబోతున్నారని ఆదివారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో టోల్గేట్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం పూలమాలతో నివాళులర్పించి రాజంపేటకు బయలుదేరడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గంగరాజు సిద్దిరాజు, మాజీ సర్పంచ్ గంగరాజు పుష్పలత, తదితర క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.


