*మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో క్వాంటం కంప్యూటింగ్ పై వర్క్ షాప్*
– *అక్టోబర్ 27 నుంచి 31 వరకు నిర్వహణ*
– *పోస్టర్ ఆవిష్కరించిన ఏయు విసి*
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
ఆంధ్ర విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ *విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదు రోజుల వర్క్ షాప్ కు సంబంధించిన పోస్టర్ ను వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు.* రాష్ట్రీయ ఉచ్చత శిక్షా అభియాన్ (రూ. 2.0) సహకారంతో మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో “”క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ”” అనే అంశంపై ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. క్వాంటం టెక్నాలజీస్ పై ప్రాథమిక అవగాహన కల్పించడం, క్వాంటం అలగారిదం, క్వాంటం కమ్యూనికేషన్ క్రిప్టోగ్రఫీ, ప్రోటోకాల్స్ పై విస్తృతమైన జ్ఞానాన్ని అందించడం ఈ వర్క్ షాప్ యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యావేత్తలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నడిపించే దిశగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఈసీఈ విభాగాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ వర్క్ షాప్ లో భాగం కావచ్చు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, ఏఐఎం-ఎల్ రంగాలలో పనిచేస్తున్న వారు సైతం ఈ వర్క్ షాప్ లో పాల్గొనడానికి అర్హులు.
*పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు, సదస్సు కన్వీనర్, గణిత శాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి. అనురాధ కామేశ్వరి, కో కన్వీనర్లు ఆచార్య పి.డి.ఎ.న్. శ్రీనివాసు, ఆచార్య జి. నానాజీరావు, రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగం డీన్ ఆచార్య వి.వల్లి కుమారి తదితరులు పాల్గొన్నారు.*


