Tuesday, 24 March 2026
  • Home  
  • క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా – పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా – పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు మరియు బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాల యంలో బహుళ ఉత్సాహంతో నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పార్టీ పదవి పొందడం గౌరవప్రదమైన విషయం అని పేర్కొన్నారు. “పార్టీలో చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కష్టపడిపనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, మనబోతుల శ్రీరామ్ పార్టీ పట్ల విశ్వాసం, నిబద్ధతతో పనిచేసి రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం గర్వ కారణమని అభినందించారు. “కోట్లల్లో మనకూ ఒక పదవి రావడం గౌరవప్రదమైన విషయం. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి,” అని పిలుపునిచ్చారు. సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతౌ ల్యంగా ముందుకు తీసుకెళ్తోం దని తెలిపారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.“బూత్ కన్వీనర్లు, యూనిట్ మరియు క్లస్టర్ ఇన్‌ఛార్జిలు పార్టీకి వెన్నెము కలు. వీరు సమర్థవంతంగా పని చేస్తే పార్టీ మరింత బలపడుతుం ది, ప్రజా విశ్వాసం పెరుగు తుంది,” అని ఎమ్మెల్యేఅన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొచ్చుల సుబ్రహ్మణ్యం బోసు, లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, మండల పట్టణ తెదేపా నేతలు, గ్రామ వార్డు నాయకులు, కూటమి నేతలు, మహిళా కార్యకర్తలు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా నియమితు లైన బాధ్యులు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

నందిగామ పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు మరియు బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాల యంలో బహుళ ఉత్సాహంతో నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పార్టీ పదవి పొందడం గౌరవప్రదమైన విషయం అని పేర్కొన్నారు. “పార్టీలో చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కష్టపడిపనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, మనబోతుల శ్రీరామ్ పార్టీ పట్ల విశ్వాసం, నిబద్ధతతో పనిచేసి రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం గర్వ కారణమని అభినందించారు. “కోట్లల్లో మనకూ ఒక పదవి రావడం గౌరవప్రదమైన విషయం. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి,” అని పిలుపునిచ్చారు. సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతౌ ల్యంగా ముందుకు తీసుకెళ్తోం దని తెలిపారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.“బూత్ కన్వీనర్లు, యూనిట్ మరియు క్లస్టర్ ఇన్‌ఛార్జిలు పార్టీకి వెన్నెము కలు. వీరు సమర్థవంతంగా పని చేస్తే పార్టీ మరింత బలపడుతుం ది, ప్రజా విశ్వాసం పెరుగు తుంది,” అని ఎమ్మెల్యేఅన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొచ్చుల సుబ్రహ్మణ్యం బోసు, లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, మండల పట్టణ తెదేపా నేతలు, గ్రామ వార్డు నాయకులు, కూటమి నేతలు, మహిళా కార్యకర్తలు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా నియమితు లైన బాధ్యులు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.