పున్నమి ప్రతినిధి – నెల్లూరు
03.01.2026 నెల్లూరు, మినీ బైపాస్
కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిచే ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఏపీ హంస కోవూరు తాలూకా ప్రెసిడెంట్ సోలా ఉమా , తాలూకా సెక్రెటరీ షేక్ ఆసియా బేగం గార్లు మాట్లాడుతూ గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ, ఉద్యోగుల అభ్యున్నతికి సహకరిస్తున్నారు అని కొనియాడారు, వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం లకు యాప్లు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లి యాప్స్ సంఖ్య తగ్గించే విధంగా కృషి చేయాలని ఏఎన్ఎం లకు వెంటనే పదోన్నతులు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమానికి ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు , జిల్లా పబ్లిసిటి సెక్రటరీ మజాహర్
, కోవూరు తాలూకా అసోసియేట్ ప్రసిడెంట్ టి. రాఘవేంద్ర , పబ్లిసిటీ సెక్రటరీ ఎస్కే. షబీనా, ట్రెజరర్ ఈ.రమణమ్మ మరియు వైస్ ప్రసిడెంట్ ఎస్.రాజేంద్ర ప్రసాద్ , జి.కామాక్షి ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.వేణు , మహిళా సెక్రటరీ సిహచ్.హైమవతి తో బాటుగా నెల్లూరు సిటీ ప్రసిడెంట్ సయ్యద్ .గౌస్ భాషా, సిటీ సెక్రటరీ బి. మంజరి తదితరులు టేబుల్ క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు .


