కోనసీమలో రైలు కోత వినబడినప్పుడే బాలయోగి నిజమైన ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు.దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 74వ జయంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాలచెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యకర్తలకు మిఠాయిలు పంచారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలలో ఎన్నాళ్ళు ఉన్నామన్నది ముఖ్యం కాదని,ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామనేది ముఖ్యమని అన్నారు.బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమం,జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు.విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన రోల్ మోడల్ అని,ఎంత ఎదిగిన ఒదగి ఉండే నైజం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.కోనసీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.ఆయన
బతికి ఉంటే కోనసీమలో రైలు కూత వినిపించేదన్నారు.
ఇప్పటికైనా ఆయన ఆశయసాధనలో భాగంగా కోనసీమలో రైలుకూత వినిపించేలా కృషిచేస్తేనే ఆయనకు నిజమైన ఘన నివాళి అని అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు స్టాంపు తీసుకురావడంలో బాలయోగి చేసిన కృషి మరువలేమన్నారు. వైశ్యుల కోరికను నెరవేర్చడానికి ఆయన చొరవచూపి స్టాంప్ వచ్చేలా కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్,తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు,మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, తలారి ఉమాదేవి, జవ్వాది మురళీకృష్ణ, కప్పల వెలుగు కుమారి, షేక్ చాన్ బాషా,బొమ్మనమైన శ్రీనివాస్,కొయ్యల రమణ, యిన్నమూరి రాంబాబు,సింహా నాగమణి,కోరుమెల్లి విజయశేఖర్,తంగెళ్ళ బాబీ,మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అప్సరీ,నాయకులు నిమ్మలపూడి గోవింద్,ఉప్పులూరి జానకిరామయ్య, పెనుగొండ రామకృష్ణ సంసాని ప్రసాద్, బెజవాడ వెంకటస్వామి,మరుకుర్తి రవియాదవ్, ఎం బ్రహ్మయ్య,కేదారశెట్టి రమణ, పేపర్ మిల్ శేఖర్, బుడ్డిగ గోపాలకృష్ణ,మళ్ళ వెంకట్రాజు, రామినేని మస్తాన్ చౌదరి,సూరంపూడి శ్రీహరి, రాయి అప్పన్న, కంచిపాటి గోవింద్, జమ్మి సత్యనారాయణ,కట్టా సత్యనారాయణ, కేవీ శ్రీనివాస్, సింహాద్రి సతీష్,వారాది నాగబాబు, తలారి భగవాన్, కవులూరి వెంకటరావు, మ వానపల్లి శ్రీనివాస్, రాయి అప్పన్న, మహబూబ్ ఖాన్,దాస్యం ప్రసాద్,కొత్తల కిషోర్,విజయలక్ష్మి,బొర్రా చినబాబు,ఆర్.సుబ్బారావు,పైలా రాంబాబు,ఆడారి లక్ష్మీనారాయణ,
మోతా నాగలక్ష్మి,తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర అధ్యక్షుడు కొమ్మర్తి బాబ్జి, నూకల శ్రీనివాస్,పుట్రేవు ప్రసాద్,కార్యనిర్వాహక కార్యదర్శిసునీల్ నయనాల్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అనిల్ బాబు,మెంబర్స్ తోట నాగేంద్ర,మొగ్గ శ్రీను,విడిఎల్ సూర్యనారాయణ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


