ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 27 మార్చి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కోదండ రామాపురం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి క్షీర పంచామృత అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక ఆర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దువ్వూరు శ్రీనివాసుల రెడ్డి, యోగనాధ్ రెడ్డి, లక్ష్మీ సౌమ్య దంపతులు ఉభయ దాతలుగా సేవలందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కోదండ రామస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 27 మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కోదండ రామాపురం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి క్షీర పంచామృత అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక ఆర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దువ్వూరు శ్రీనివాసుల రెడ్డి, యోగనాధ్ రెడ్డి, లక్ష్మీ సౌమ్య దంపతులు ఉభయ దాతలుగా సేవలందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

