*కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్*….
* *ఉవ్వెత్తిన ఎగిసిన దక్షిణ శ్రేణుల నిరసన జ్వాల*
* *కూటమి సర్కార్ పై మిన్నంటిన ప్రజా వ్యతిరేకత*
* *పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ప్రైవేటుపరం*
* *పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమే చంద్రబాబు ధ్యేయం*
— *విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*
*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*
జిల్లా వైఎస్ఆర్సిపి నిర్వహించిన కోటి సంతకాల ప్రతుల వ్యాన్ ర్యాలీ ఉద్యమం సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విజయవంతం పట్ల కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారనడానికి చిహ్నమన్నారు. ఈ మేరకు
35 వ వార్డు అధ్యక్షులు అలుపున కనక రెడ్డి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ సక్సెస్ సమావేశంలో వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని ఆరోపించారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైందన్నారు. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్ జగన్ భావించారని చెప్పారు.
ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభమైందన్నారు.
ఈ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయని, దీంతో ఈ కార్యక్రమం ప్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించిందన్నారు కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగిందన్నారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంకల్పించారని,
అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారని, తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అయితే
చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్ ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించిందన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విశాఖలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. సంతకాల ప్రతుల వాహనాన్ని జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం వరకు భారీ ర్యాలీగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఇకపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైసిపి ఎండ గడుతుందన్నారు.
జగన్మోహన్ రెడ్డి పిలుపుతో తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
ఇదే తరహాలో…. జగనన్న జన్మదిన వేడుకలు జరగాలి!
కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సక్సెస్ తరహాలో ఈనెల 21వ తేదీన జనహృదయనేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట తప్పని ఏకైక లీడర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నని అన్నారు. అటువంటి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. సంచలనాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారన్నారు. పేద , మధ్య అన్ని తరగతుల ప్రజలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైసీపీ నేనని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ అకుంఠ దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వాడ వాడలా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని దక్షిణ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలతో పాటు భారీ కేక్ కటింగ్ లు సంబరాలు నిర్వహిస్తామని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


