డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి)
ఈ రోజు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబాజీపేట మండలం, కొర్లపాటి వారి గ్రామంలోని శ్రీ విజయ కనకదుర్గ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. ఆయనతో పాటు నాయకులు సుదాబత్తుల రాము గారు, కొర్లపాటి కోటబాబు గారు, మేడిద సత్తిబాబు గారు, చప్పిడి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయదశమిని ఘనంగా నిర్వహించారు.


