కొత్త లేబర్ కోడ్స్.. భారత అభివృద్ధి దిశలో మైలురాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులుగా ఇవి నిలుస్తాయని చెప్పారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. వీటితో ఉద్యోగుల భద్రత మరింత బలోపేతమవుతుందని, వేతనాల హామీ ఉంటుందని పేర్కొన్నారు. కార్మికుల గౌరవం, హక్కలకు ప్రాముఖ్యత లభిస్తుందని వివరించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక రక్షణతో పాటు మహిళలకు మరింత సమానత్వం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చరిత్రాత్మక సంస్కరణను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు.

కొత్త లేబర్ కోడ్స్ తో మరింత సమానత్వం