కొడూరు, ఆగస్టు 17:
రాజంపేట నియోజకవర్గంలోని ఒబులవారిపల్లి మండలం వై.కొట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రతి ఆడివారం జరిగే మార్కెట్‌కు సుమారు 25కు పైగా గ్రామాల ప్రజలు తరలివస్తున్నారని వారు తెలిపారు.
ఈ గ్రామంలో దాదాపు 5,600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు బస్సు సౌకర్యం లభించకపోవడంతో విద్యార్థులు, రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లభించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.


