-టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని విస్తృత స్థాయిలో ప్రచారం
– పాల్గొన్న గ్రామీణ ఖాది పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి, ఎమ్మెల్సీ అనురాధ, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్
-నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది… చేనేత కార్మికుల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది : కె కె చౌదరి.
ఒంటిమిట్ట, ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలం, కొండ మాచుపల్లి గ్రామంలో జరుగుతున్న జడ్పిటిసి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఖాది గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి , ఎమ్మెల్సీ అనురాధ గారు, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ గారు, జనసేన నాయకులు శివరామ రాజు గారు, సుండుపల్లి మండల అధ్యక్షులు రెడ్డప్ప గారు మరియు స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడినప్పుడు ఏడాది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పథకాల విజయవంతమైన అమలు, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల విస్తరణ, రహదారి నిర్మాణం, తాగునీటి సదుపాయాల కల్పన, విద్యుత్ సరఫరా మెరుగుదల, రైతులకు పంట పెట్టుబడి సాయం, మహిళల కోసం ‘సూపర్ సిక్స్’ ఉచిత బస్సు పథకం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అనేక రంగాల్లో జరిగిన ప్రగతిని వివరించారు.నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. చేనేత కార్మికుల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని గ్రామస్థులకు ఖాదీ బోర్డు చైర్మన్ కె కె చౌదరి వివరించారు.సియం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల ఆశలు నెరవేర్చడమే తమ ధ్యేయమని, అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీ అభ్యర్థిని గెలిపించి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరారు.


