అనంతగిరి(పున్నమి ప్రతినిధి) మండలం లోని కేకే రైల్వే లైన్లోని తైడా-చిముడుపల్లి స్టేషన్ల మధ్య ట్రాకపై ఆదివారం తెల్లవారు జామున పెద్ద బండరాయి విరిగిపడింది. అదే టైంలో విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు బండరాయిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ఇంజను దెబ్బతిని పట్టాలు తప్పి రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై బండరాయి తొలగించి ట్రాక్ పుణరుద్ధరణ పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం విశాఖ నుండి బయలుదేరే విశాఖ-కిరండూల పాసింజర్ రైలు రద్దు చేశారు. ట్రాక్ పుణరుద్ధరణ పనులు ఆదివారం మధ్యాహ్నంకు పూర్తవడంతో రైళ్ళ రాకపోకలను అనుమతించారు.
కేకే రైల్వే లైన్లో పడిన బండరాయి… హుటాహుటిన పుణరుద్దరణ పనులు