కె ఎస్ యు ఎఫ్ ఆధ్వర్యంలో రాయచోటి జిల్లా వద్దు రాజంపేట జిల్లా ముద్దు ఆటో డ్రైవర్ల నిరసన
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు కోడూరు స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రాయచోటి వద్దు అన్నమయ్య జిల్లా ముద్దు అని నినాదాలు చేసుకుంటూ ఆటో డ్రైవర్ల అందరూ తమ ఆటోలతో నిరసన తెలుపుతూ యూనియన్ డ్రైవర్ల అందరూ కలిసికట్టుగా తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగినదని. తరువాత తాసిల్దార్ అమర్నాథ్ మాట్లాడుతూ మీరిచ్చిన అర్జీని అధికారులకు పంపిస్తానని చెప్పడం జరిగినది కే ఎస్ యు ఎఫ్ అధ్యక్షుడు బండారు మల్లికార్జున మీడియా వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
కె ఎస్ యు ఎఫ్ యూనియన్ లీడర్లు శంకరయ్య,నరేంద్ర, మనీ,చాంద్ భాషా, చంగల్ రాయుడు, ఉపాధ్యక్షులు హస్తి భరత్ కుమార్ రాజు, సెక్రటరీ జెట్టి హరీష్, ఓబులవారిపల్లె మండల కన్వీనర్ గంగరాజు సునీల్ వర్మ, మల్లెం హేమంత్ మొదలగు వారు పాల్గొన్నారు.

