Tuesday, 24 March 2026
  • Home  
  • కృష్ణాజిల్లా నిరుద్యోగులకు శుభవార్త – కలెక్టర్ డీకె బాలాజీ
- ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లా నిరుద్యోగులకు శుభవార్త – కలెక్టర్ డీకె బాలాజీ

పత్రికా ప్రకటన నవంబర్ 1న కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా.. -నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…-జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.01.11.2025 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు కృష్ణాజిల్లా ,పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(కమ్యూనిటీ హాల్) నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేశారు.. ఈ జాబ్ మేళాలో, జపనీస్ MNC – NS ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ MNC – కోల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కాన్ MNC, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, PVS లాబొరేటరీస్ లిమిటెడ్, సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్)వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 1న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. Sd/-డి. విక్టర్ బాబుడిజిగ్నేటెడ్ ఆఫీసర్/ఉపాధి కల్పన అధికారికృష్ణా జిల్లా dr పి.నరేష్ కుమార్జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారికృష్ణా జిల్లా*పత్రికా ప్రకటన*

పత్రికా ప్రకటన

నవంబర్ 1న కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.01.11.2025 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు కృష్ణాజిల్లా ,పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(కమ్యూనిటీ హాల్) నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేశారు..

ఈ జాబ్ మేళాలో, జపనీస్ MNC – NS ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ MNC – కోల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కాన్ MNC, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, PVS లాబొరేటరీస్ లిమిటెడ్, సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్)వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 1న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

   ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration  లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 80743 70846, 96767 08041 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Sd/-
డి. విక్టర్ బాబు
డిజిగ్నేటెడ్ ఆఫీసర్/ఉపాధి కల్పన అధికారి
కృష్ణా జిల్లా

dr పి.నరేష్ కుమార్
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి
కృష్ణా జిల్లా*పత్రికా ప్రకటన*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.