కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో ముఖ్య హామీని అమలు దిశగా నేడు ముందడుగు వేసింది.అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసిన 3 లక్షల 192 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి, ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని. పేదలకు సొంతిల్లు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం నిరంతర కృషి చేసింది అని. ఆ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలిగాం అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు ఈ భారీ గృహప్రవేశ కార్యక్రమం జరిగిందని.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది అని తెలిపారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అందులో
పీఎంఏవై-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు,పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు,
పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లు,మొత్తం 3,00,192 ఇళ్ల నిర్మాణం పూర్తయింది అని తెలిపారు.
మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వ సంకల్పబలం,ప్రజా సంక్షేమానికి అంకిత భావానికి నిదర్శనం.ప్రతి పేద కుటుంబానికి గృహ భద్రత కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం నిజమైన సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది” అని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి జరిగే ఈ గృహప్రవేశాల ద్వారా ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని మరోసారి నిలబెట్టుకుంది అని.పేదల సంతోషం కుటుంబాల స్థిరత్వం ఇదే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వ మరో హామీ అమలు – 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు శ్రీకారం మేడా విజయ శేఖర్ రెడ్డి
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో ముఖ్య హామీని అమలు దిశగా నేడు ముందడుగు వేసింది.అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసిన 3 లక్షల 192 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి, ఒకేసారి గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని. పేదలకు సొంతిల్లు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం నిరంతర కృషి చేసింది అని. ఆ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలిగాం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు ఈ భారీ గృహప్రవేశ కార్యక్రమం జరిగిందని.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది అని తెలిపారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అందులో పీఎంఏవై-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు,పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై-జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లు,మొత్తం 3,00,192 ఇళ్ల నిర్మాణం పూర్తయింది అని తెలిపారు. మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వ సంకల్పబలం,ప్రజా సంక్షేమానికి అంకిత భావానికి నిదర్శనం.ప్రతి పేద కుటుంబానికి గృహ భద్రత కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం నిజమైన సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది” అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేసారి జరిగే ఈ గృహప్రవేశాల ద్వారా ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని మరోసారి నిలబెట్టుకుంది అని.పేదల సంతోషం కుటుంబాల స్థిరత్వం ఇదే కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

