Tuesday, 9 December 2025
  • Home  
  • కుల విక్షవత చూపి,కులం పేరుతో దూషించిన మునీర్ అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలి నంది విజయలక్ష్మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక
- Blog

కుల విక్షవత చూపి,కులం పేరుతో దూషించిన మునీర్ అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలి నంది విజయలక్ష్మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక

మునీరు అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. మునీరు అహమ్మద్ ను తక్షణమే అరెస్టు చేయాలని బాధిత దళిత మహిళతో కలసి స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి నంది విజయలక్ష్మి మాట్లాడుతూ *టు లెట్* బోర్డు చూసి ఇల్లు బాడుగకు కావాలని మున్నీరు అహమ్మద్ ఇంటికి వెళ్ళిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి ఇల్లు చూపించి ఆ తర్వాత కులం అడిగాడు. మాదిగ అని దళిత మహిళ చెబితే మాల మాదిగోల్లకు ఇల్లు ఇవ్వమని ఇంటి యజమాని తెలుపగా బయట బోర్డు మీద మాదిగోల్లకు ఇవ్వము అని వ్రాసి పెట్టకూడదా అని దళిత మహిళ అంటే మాల మాదిగ లు మకురు తో కొవ్వెక్కి ఇట్లా చిల్లరగా మాట్లాడతారు అని మునీరు అహమ్మద్, అతని కూతురు దళిత మహిళను నీచంగా మాట్లాడి కులం పేరుతో దూషించడం జరిగిందని ఆమె తెలిపారు. దళిత మహిళను కులం పేరుతో దూషించి వివక్షత చూపిన ఇంటి యజమాని మునీరు అహమ్మద్ తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఇంటి యజమానులు *టూ లెట్* అని బోర్డు పెడుతూ శాకాహారులకు మాత్రమే అని బోర్డు కింద వ్రాసి ప్రత్యేకంగా మరీ పెడుతున్నారని ఆమె తెలిపారు. అలాగే బ్రాహ్మణులకు మాత్రమే, రెడ్లకు మాత్రమే, కమ్మలకు మాత్రమే ఇల్లు బాడుగకు ఇవ్వబడును అని బోర్డు పెట్టుకుంటే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. ఎందుకంటే మాల మాదిగ సామాజిక వర్గాల వారు ఆ బోర్డు చూసి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్లరని ఆమె అన్నారు. మున్నీరు అహమ్మద్ ఒక గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంటూ కులమతాలకు అతీతంగా ఉండాల్సిన వ్యక్తి కుల వివక్షత చూపుతూ ఇంటి కోసం వెళ్ళిన దళిత మహిళను అవమానించడం సరైనది కాదని ఆమె అన్నారు. కర్నూలు టౌన్ డిఎస్పీ నిందితులకు కొమ్ము కాస్తూ బాధిత మహిళలకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం చూపించడం బాధాకరమని ఆమె తెలిపారు. అంతే కాకుండా బాధిత దళిత మహిళ తండ్రి కూతుర్ల మీద ఫిర్యాదు చేయగా, తండ్రిపై మాత్రమే కేసు నమోదు చేసి కూతురిని కేసు నుండి తప్పించడములో కర్నూలు DSPఆంతర్యం ఏమిటి ? అని నంది విజయలక్ష్మి అన్నారు. కర్నూలు DSP బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన మాట్లాడటం చూస్తే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుందని ఆమె తెలిపారు. కుల వివక్షత చూపుతూ కులం పేరుతో దూషించి అవమానించిన మునీరుఅహమ్మద్ మరియు అతని కూతురు పై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత దళిత మహిళతో పాటు భారతమ్మ,పాలెం రాధ, కటికే భాను, ఈరమ్మ, ఎలిశమ్మ,అకుతోట పద్మ, హుసేన్ బి, తాటికొండ సుంకమ్మ, షేకున్ బీ, రేవతి, కొమ్ముపెద్దక్క, వెంకటలక్ష్మి , రంగమ్మ, దస్తగిరమ్మ,లక్ష్మీశ్వరి,మరియమ్మ, ఖాసింబీ సుశీల, లక్ష్మీదేవి, కన్యాకుమారి, కృష్ణవేణి, వరాలు, సుజాత, షేక్ పర్వీన్,ఖజాబీ తదితర మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.