తేది:03/10/2025
కుమూరం భీం ఆసిఫాబాద్ జిల్లా:
అమరజీవి కుమురం భీం 85వ వర్ధంతి, కోలాం ఆదివాసీ క్రాంతి వీర్ కుమురం సూరు 28వ వర్ధంతి సందర్బంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ను గౌరవ ఆసిఫాబాద్ శ్రీమతి ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు తమ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ వీరుల వర్ధంతి కార్యక్రమాన్ని 07-10-2025 తేదీన కేరిమెరి మండలం, జోడేఘాట్ గ్రామంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివాసీల హక్కుల కోసం, జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కుమురం సొనేరావు, కుమురం లాల్ సావ్ ఉత్సవ కమిటీ చైర్మన్ పెందొర్ మొతిరాం,మాజీ ఎంపీపీ తొడసం జగన్నాథ్,కమిటీ సభ్యులు భుత బాపురావు, మడవి రాజు, సూరు కమిటీ చైర్మన్ కుంరం మారుతీ,కన్వీనర్ సిడం ద్రాము పాల్గొన్నారు

