కుక్కలను విషం పెట్టి చంపడంపై మంత్రి సీతక్క సీరియస్
కుక్కలను చంపకుండా గ్రామ పంచాయతీలకు మార్గదర్శకాలు జారీ
కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలను విషప్రయోగంతో చంపిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపిన మంత్రి సీతక్క
వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్దం
ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క



