కలసికట్టుగా పని చేద్దాం…. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం
కార్యకర్తలే టిడిపికి మూల స్తంభాలు….సంక్షేమానికి టిడిపి పెద్ద పీట…
కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని.
పున్నమి ప్రతినిధి. రామచంద్రాపురం
కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త కష్టాలలో పాలుపంచుకుంటానని, వారి సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపుతానని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం మండలంలోని నెత్త కుప్పం గ్రామంలో రాయలచెరువు కట్టపై ఉన్న గ్రామ పంచాయతీల క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని కి టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మూడు దశాబ్దాల అనంతరం చంద్రగిరిలో టిడిపి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం….. గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలు….. పార్టీకి మూల స్తంభాలని, వారి సంక్షేమానికి పార్టీ పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. టిడిపిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులతో గుర్తింపు లభిస్తుందన్నారు. టిడిపిలో ఉండి… ప్రతిపక్ష పార్టీ వాళ్లకి సహకరించేవారు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనంతరం పంచాయతీల వారీగా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల సమస్యలు, గ్రామాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యేగా రాయల చెరువు- అనుపల్లి రోడ్డు, గుండోడు కణం నూతన రోడ్డు ఏర్పాటు. గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మించి అభివృద్ధి చేశామన్నారు. నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ….. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గతంలో వైసీపీ అరాచక పాలన సాగించి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నారని తెలిపారు. గత పదేళ్లగా చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబ పాలన సాగించారని, నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతున్నదన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసే స్థానిక ఎన్నికలలో విజయకేతనం ఎగిరివేదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మీయ సమావేశాలు టిడిపి కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఈ ఆత్మీయ సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం తిరుమలరెడ్డి, ఎం ఎస్ ఎం ఈ రాష్ట్ర డైరెక్టర్ ఎన్ చిన్న బాబు, ఆరి లీలా మోహన్ నాయుడు, ఈతమాకుల ఉమాపతి నాయుడు, సింగల్ విండో చైర్మన్ సి జనార్దన్ చౌదరి, మాజీ ఎంపీపీ టీ కేశవులనాయుడు, బి ధనుంజయలు, జెడి జగన్, బాధూరు కోటేశ్వర్ రెడ్డి,, కోరా హరిప్రసాద్, గిరి నాయుడు, రెడ్డప్ప నాయుడు, మురళి నాయుడు, బండి విజయ్ కుమార్ రెడ్డి, ఆకా దేవరాజులు, శేఖర్ నాయుడు, యూనిట్, క్లస్టర్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్.
1. టిడిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పులివర్తి నాని.
2. సమావేశానికి హాజరైన టిడిపి నాయకులు.
3. ఎమ్మెల్యే పులివర్తినానికి ఘన స్వాగతం పలుకుతున్న టిడిపి నాయకులు.



