కార్యకర్తల అభిప్రాయంతోనే మండల అధ్యక్షుల ఎంపిక – ఎమ్మెల్యే విజయశ్రీ
సూళ్లూరుపేట నియోజకవర్గంలో జూన్ 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు కార్యకర్తల కోరిక మేరకే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. ఏ ఒక్క మండలంలోనూ విభేదాలు లేకుండా ఐక్యంగా అధ్యక్షులను ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి శివప్రసాద్ గారు అబ్జర్వర్‌గా విచ్చేస్తారని, ప్రతి మండలానికి ఒక అబ్జర్వర్‌ను నియమించారని తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్ లు కూడా ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు.