*కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి*
.
*పెట్టుబడిదారుల కోసం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి*
స్టేషన్ ఘనాపూర్:-ఈరోజు సిఐటియు మండల కార్యాలయంలో సిఐటియు 9వ మహాసభకు అధ్యక్షులుగా రావుల జగన్నాథం, అమరాజు బాబు వ్యవహరించగ ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ రాపర్తి రాజు గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేంద్ర బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం వలన కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం వలన కార్మికులు స్వాతంత్రం పూర్వం నుండి అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఉద్యోగుల రాజ్య భీమ చట్టం (ఈఎస్ఐ ), ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ (పిఎఫ్ ), గ్రాండ్ డ్యూటీ చెల్లింపుల చట్టం, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సెస్ చట్టం, వర్కింగ్ జర్నలిస్ట్ వేతన రేట్ల నిర్ధారణ చట్టం, మోటర్ ట్రాన్స్ పోర్ట్ కార్మికుల చట్టం లతోపాటు 29 రకాల కార్మికుల హక్కుల రక్షణ కోసం చేసినటువంటి చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని. పని గంటలను 8గంటల నుండి 12 గంటలకు పెంచడం కార్మికుల శ్రమ దోపిడీ చేయడమే దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ధ్వంసం చేస్తూ ప్రజల, కార్మికుల, రైతుల, సబండ వర్గాల హక్కులను స్వాతంత్రాన్ని హరించి వేస్తుందని. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తుంది. పెట్టుబడుదారుల మెప్పు కోసమే బిజెపి మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తయారు చేసిందని అన్నారు.
2016 నుండి అమల్లోకి వచ్చిన 7వ పే కమిషన్ పే స్కేలు ప్రకారం కార్మికులకు 26 వేల జీతం ఇవ్వాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తూ అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ నెలకు 9000 ఇవ్వాలని కార్మికుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరిస్తూ పని గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచుతూ చేసినటువంటి జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కొడపాక యాకయ్య వివిధ రంగాల కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు లింగనబోయిన శ్రీకాంత్, వెలిశాల రాజు, బొంకూరు రామచంద్ర, జి రామచంద్రం, దైద అనిల్, కొలిపాక వెంకన్న, గుమ్మల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు


