కామ్రేడ్ దామా అజయ్ ఇకలేరు .

    0
    219

    కావలిలో ఎంతోకాలం న్యాయవాదిగా తన సేవలు ప్రజలకు అందించిన కామ్రేడ్ దామా అజయ్ కుమార్ కాసేపటి క్రితం హైద్రాబాద్ స్టార్ హాస్పిటల్ లో కన్ను మూశారు . కొద్ది సంవత్సరాలుగా హైద్రాబాద్ లోని నిజాంపేట లో కాపురముంటున్న దామా అజయ్ కుమార్ ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయన్ను స్టార్ హాస్పిటల్ కు తరలించారు . చికిత్స పొందుతూ అక్కడ మరణించారు .

    తండ్రి కామ్రేడ్ దామా చెంచెయ్య కుమారుడైన దామా అజయ్ కుమార్ తండ్రి బాటనే ఎన్నుకున్నాడు .విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడైన అజయ్ – అన్యాయాల్ని ఎదుర్కొనడంలో ముందుండేవారు . తండ్రి దామా చెంచెయ్య గారు ఇటీవల మరణిస్తే – ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన సాయిపేట కు తీసుకొని వచ్చి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు అజయ్ కుమార్ .
    తండ్రి దామా చెంచెయ్య చనిపోయిన కొద్ధి మాసాలకే కుమారుడు అజయ్ కుమార్ తుది శ్వాస వదిలడం ఆ కుటుంబానికి, సన్నిహితులకు తీరని శోకం మిగిల్చింది

    0
    0