BJP ధర్నాతో హడలిపడ్డ అధికారులు.. 9న సమావేశం వాగ్దానం!
కామారెడ్డి, జనవరి 6, (పున్నమి ప్రతినిధి) :
ఒకే ఇంట్లో పదులాది ఓట్లు.. గ్రామీణ ఓటర్లు పట్టణ జాబితాల్లో! మున్సిపల్ వార్డు ఓటరు జాబితాల్లో పెద్ద లోపాలు తేలడంతో భారతీయ జనతా పార్టీ (BJP) కామారెడ్డి పట్టణ శాఖ మున్సి పల్ కార్యాలయం ముందు గట్టి ధర్నా చేపట్టింది. కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమం పట్ట ణవాసుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓటరు జాబితాల్లో ఈ తప్పులు.. పట్టణవాసులు కోపంతో మండిపడ్డారు! గ్రామీణ ఓటర్లు పట్టణ జాబితాల్లో! పట్టణ వార్డుల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు చేర్చబడ్డారు.ఒకే ఇంటి మీద పదుల ఓట్లు! ఒకే అడ్రస్‌పై 20-30 ఓట్లు నమోదు!ఇష్టానుసారం వార్డులు మార్చారా? గత వార్డు ప్రకారం కాకుండా రాండమ్‌గా జాబితాలు ప్రచురించారు.సమస్యలు చెప్పే అవకాశం లేదు! రాజకీయ పార్టీల సమావేశం లో కూడా మాట్లాడే సమయం ఇవ్వలేదు. కామారె డ్డి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, BJP స్టేట్ కౌన్సిలర్ విపుల్ జైన్లు మాట్లాడుతూ, “ఓటరు జాబితాలు పూర్తిగా తప్పులతో నిండిపోయాయి! నిన్న రాజకీయ పార్టీల సమావేశంలో సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వకపోవడంతో ఈ ధర్నా చేయా ల్సి వచ్చింది” అని ఆరోపించారు. వీరు నిన్నే లిఖి త పిర్యాదులు ఇచ్చినా స్పందన లేకపోవడాన్ని ఎత్తిచూపారు.అధికారుల వాగ్దానం 9న సమా వేశం.. అభ్యంతరాలు చెప్పండి! ధర్నా స్థాయి లేకుండా అధికారులు అన్ని పిర్యాదులు పరిష్క రిస్తామని, పూర్తి ఓటరు జాబితా ఏర్పాటు చేసి 9 తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం పెడతామని వాగ్దానం చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ చెప్పొచ్చు” అని చెప్పడంతో BJP నేతలు ధర్నా విరమించారు. అయితే, తప్పులు సరిచేయ కపోతే BJP ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం రావడ మే కాదని హెచ్చరించారు.ఈ ఘటన పట్టణ వాసు ల్లో పెద్ద అల్లరు సృష్టించింది. ఎన్నికల ముందు ఓటరు జాబితాలు పరిపూర్ణంగా ఉండాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు.


