స్థానిక రమణయ్య పేట లో
కేన్సర్ ని జయించిన మహిళల కు కాకినాడ ఐడిఎ సభ్యులు వారికి పండ్లు మరియు
వస్త్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ
“ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న క్యాన్సర్ రోగులకు ఆశ, ధైర్యం మరియు ఓదార్పును తెలియజేయడానికి అంకితం చేయబడిన ఈ దినోత్సవం క్యాన్సర్ రోగుల సంరక్షణ, మద్దతు మరియు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి అంకితం చేయబడిందని తెలిపారు.
ఈ దినోత్సవం క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి ఆశ, సంకల్పం మరియు ధైర్యం యొక్క చిహ్నంగా గులాబీ పువ్వులను ఉపయోగించుకుంటుందని,
క్యాన్సర్ రోగులకు మెరుగైన సంరక్షణ, మద్దతు మరియు వనరుల అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ రోజు ఉద్దేశించబడిందని,
క్యాన్సర్ నివారణ, చికిత్సల గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుందనీ,రోగులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడం, వారి చికిత్సా విధానంలో వారికి ఊరట కలిగించడం,
క్యాన్సర్ రోగులకు సహాయం అందించే సంస్థలకు విరాళం ఇవ్వడం,
క్యాన్సర్ రోగులతో మాట్లాడటం, వారికి మానసిక ధైర్యం చెప్పడం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వేంకటేశ్వర రావు,
కాకినాడ ఐడిఎ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు .


