దివ్యాంగుల దినోత్సవాన్ని నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఈ సందర్భంలో హాజరయ్యారు.
దివ్యాంగుల ప్రతిభను గుర్తించి సత్కరించిన సభలో ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, “దివ్యాంగులు సమాజానికి భారమయ్యే వారు కాదు… సరైన అవకాశాలు లభిస్తే అసాధ్యాన్నే సాధ్యం చేసే శక్తి వారి సొంతం. వారిని ప్రోత్సహించడం ప్రభుత్వం మాత్రమే కాక సమాజం మొత్తం బాధ్యత” అని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల సంక్షేమ పథకాలపై ఆమె వివరించారు.
వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన దివ్యాంగులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు, మోమెంటోలు అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.


