ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఖమ్మం జిల్లాలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచంద్రరావు పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేదలపై భారాలు మోపుతోందని తీవ్రంగా విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో మరింత పెరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు.
ధర్నా అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్, మండదపు సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకదాని పుల్లారావు యాదవ్, ఇవీ రమేష్, నున్న రవికుమార్, , గుత్తా వెంకటేశ్వర్లు, వక్కలంక సుబ్రహ్మణ్యం, రవిరాథోడ్, మేకల నాగేందర్, మంద సరస్వతి తదితర నాయకులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


