*కాంగ్రెస్ పై ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు : ప్రియాంక దండి*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ” ఓట్ చోర్, గద్దె చోడ్ ” సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద యువతలో విశ్వాసం పెరిగిందని, యువత స్వచ్చందంగా వచ్చి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వైపు యువత ఆకర్షతులవుతున్నారు, ఆంధ్ర విశ్వ విద్యాలయంలో త్వరలో ఎన్ ఎస్ యు ఐ కమిటీ వేస్తామని, ఓట్ చోర్ ఉద్యమానికి మంచి స్పందన వస్తోందని, కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని ఆమె అన్నారు, కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు జాన్ మాస్టర్ పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకప్పుడు కాంగ్రెస్ కంచు కోట అని మళ్లీ కంచు కోటగా తీర్చిదిద్దుతామని, కాంగ్రెస్ హయాంలోనే అందరికి యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగులు ఎప్పుడు కాంగ్రెస్ కి విశ్వాసంగా ఉంటారని,పార్టీకి మంచి రోజులు రాబోతునాయని, పాత కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ జండా పట్టుకుంటారని ఆయన అన్నారు, కార్యక్రమంలో నాయకులు జగన్ మురారి, సూర్య, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, గుర్రం కనకరాజు, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పై ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు : ప్రియాంక దండి*
*కాంగ్రెస్ పై ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి మంగళవారం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ” ఓట్ చోర్, గద్దె చోడ్ ” సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద యువతలో విశ్వాసం పెరిగిందని, యువత స్వచ్చందంగా వచ్చి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వైపు యువత ఆకర్షతులవుతున్నారు, ఆంధ్ర విశ్వ విద్యాలయంలో త్వరలో ఎన్ ఎస్ యు ఐ కమిటీ వేస్తామని, ఓట్ చోర్ ఉద్యమానికి మంచి స్పందన వస్తోందని, కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని ఆమె అన్నారు, కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు జాన్ మాస్టర్ పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకప్పుడు కాంగ్రెస్ కంచు కోట అని మళ్లీ కంచు కోటగా తీర్చిదిద్దుతామని, కాంగ్రెస్ హయాంలోనే అందరికి యూనివర్సిటీలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగులు ఎప్పుడు కాంగ్రెస్ కి విశ్వాసంగా ఉంటారని,పార్టీకి మంచి రోజులు రాబోతునాయని, పాత కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ జండా పట్టుకుంటారని ఆయన అన్నారు, కార్యక్రమంలో నాయకులు జగన్ మురారి, సూర్య, వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, గుర్రం కనకరాజు, భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు.

