ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా (టి) గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో జన సురక్ష కార్యక్రమం నిర్వహించగా జిల్లా ఎల్దియం ఉత్పల్ కుమార్ ధామ్, జిల్లా పరిశ్రమల అధికారి పద్మ భూషణ్ రాజు హాజరై మాట్లాడుతూ వినియోగ దారుల రక్షణ కొరకు బ్యాంకులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. జన సురక్ష కార్యక్రమం పిఎంఎస్బిఐ, పిఎంజేజేబివై పథకాల ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసాగా ఉంటాయని తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ తో లావాదేవీలు సులువుగా ఉంటాయని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు కలిగి ఉండాలని అన్నారు. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న, ఎంఎస్ఎంఈ సిబ్బంది పృథ్వీ రాజ్, ఆదర్శ్, పంచాయతీ కార్యదర్శి రాఖీ, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, కారోబారి సాయి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

కస్టమర్ల ఆర్థిక ఎదుగుదలకు బ్యాంకులు కృషి