Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

కమ్యూనిస్టు నాయకుడు దండు సమ్మయ్య ముదిరాజ్ పార్ధివదేహానికి నివాళులు అర్పించిన నాయకులు

Punnami Newsroom Published:
కమ్యూనిస్టు నాయకుడు దండు సమ్మయ్య ముదిరాజ్ పార్ధివదేహానికి నివాళులు అర్పించిన నాయకులు

Story highlights

  • వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాదన్నపేట గ్రామానికి చెందిన యంసిపిఐ సీనియర్ నాయకులు నర్సంపేట పులిబిడ్డ, అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ అనుచరుడు దండు సమ్మయ్య ముదిరాజ్ అనారోగ్యంతో మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్…
  • అనంతరం పిఆర్ ముదిరాజ్ సేవా సమితి వ్యవస్థాపకులు పెసరు రాజన్న సహకారంతో దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్ లు సమ్మయ్య కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
  • ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ జాతి బిడ్డల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తూ పేద కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న పెసరు రాజన్న ముదిరాజ్ తో పాటు దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్ లతో పాటు ఆ సంస్థ…

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాదన్నపేట గ్రామానికి చెందిన యంసిపిఐ సీనియర్ నాయకులు నర్సంపేట పులిబిడ్డ, అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ అనుచరుడు దండు సమ్మయ్య ముదిరాజ్ అనారోగ్యంతో మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, పి ఆర్ ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్ లు సమ్మయ్య పార్ధివదేహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పిఆర్ ముదిరాజ్ సేవా సమితి వ్యవస్థాపకులు పెసరు రాజన్న సహకారంతో దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్ లు సమ్మయ్య కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ జాతి బిడ్డల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తూ పేద కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న పెసరు రాజన్న ముదిరాజ్ తో పాటు దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్ లతో పాటు ఆ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
పీఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గొర్రె ప్రభాకర్, మాధన్నపేట కుల పెద్దమనుషులు దండు రామనర్సయ్య, జల్లి ఐలయ్య, దండు రవి, పోలేబోయిన ఆనంద్, దండు రమేష్, గిన్నె వెంకటయ్య, దండు రమేష్ బాబు, దండు తిరుపతి లతో పాటు కుటుంబ సభ్యులు, బందు మిత్రులు పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *