Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

నవంబర్ 6లోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి బుధరావుపేట క్లస్టర్ ఇన్‌చార్జిల పిలుపు

Punnami Newsroom Published:
నవంబర్ 6లోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి బుధరావుపేట క్లస్టర్ ఇన్‌చార్జిల పిలుపు

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధరావుపేట క్లస్టర్ పరిధిలోని గ్రామాల అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బుధరావుపేట క్లస్టర్ ఇన్‌చార్జిలు ఎస్.కె. ఆసిఫ్, సోమరపు రవి విజ్ఞప్తి చేశారు. 2023 నవంబర్‌కు ముందు డిగ్రీ పూర్తి చేసి, ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టభద్రులు నవంబర్ 6లోపు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఉచితంగా ఓటరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
బుధరావుపేట గ్రామంలో అర్హులైన పట్టభద్రులకు ఉచితంగా ఓటరు నమోదు ప్రక్రియలో సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదుకు అవసరమైన ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వివరాలు, డిగ్రీ మెమో లేదా సంబంధిత విద్యార్హత ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఫోన్ నంబర్ తదితర వివరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వాట్సాప్ ద్వారా వివరాలు పంపించి కూడా నమోదు ప్రక్రియకు సహకారం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య, బుధరావుపేట మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సుభాన్ బి. మౌలానా, ఖానాపురం ఎమ్మెల్సీ ఇన్‌చార్జి ఎస్.కె. మస్తాన్, కోరే రాము, భూసబోయినఅశోక్, ఆబోతు అశోక్, బుధరావుపేట క్లస్టర్ ఇన్‌చార్జిలు ఎస్.కె. ఆసిఫ్, సోమరపు రవి, గ్రామ ఉపసర్పంచ్ సింగు సుధాకర్, మాజీ అధ్యక్షుడు నీలమర్రి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నవంబర్ 6లోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి బుధరావుపేట క్లస్టర్ ఇన్‌చార్జిల పిలుపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *