సర్పంచ్ గొల్ల మహేష్ నాయకత్వంలో 20,500 రూపాయలు అందజేత
కామారెడ్డి 2 జనవరి (పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో పంచాయతీ వర్కర్ కరికే నర్సింగ్ తల్లి మరణించిన సందర్భంగా,వారి కుటుంబానికి గ్రామ పంచాయతీ పాలకులు, కాంగ్రెస్ నాయకులు గొప్ప మానవతా దృక్పథం చూపారు.ఈ సహాయం తెలం గాణ గ్రామీణ ప్రజల మధ్య మంచి సందేశాన్ని ఇచ్చింది. పంచాయతీ సర్పంచ్ గొల్ల మహేశ్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఉపసర్పంచ్ యాత్వంత్ రావు, వార్డు సభ్యులు శగా నవీన్, హరీష్, ప్రశాంత్, లావణ్య, రవళి, విజయ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బిక్షపతిలు కలిసి కుటుంబానికి రూ.20,500 సహాయం అందజేశారు.ఈ కార్యక్ర మం గ్రామంలో ఐక్యతను పెంచి,పాలకుల మానవ త్వాన్ని ప్రదర్శించారు.కుటుంబ సంక్షేమ ప్రాధాన్య త పంచాయతీ పాలకులు కరికే నర్సింగ్ కుటుంబా నికి తమ వంతు సహాయం చేసి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉప్శమనం కల్పించారు.ఈసహాయం ద్వా రా గ్రామంలో సంక్షేమ భావన పెరిగిందని చెప్పారు. తెలంగాణలో ఇలాంటి చిన్న చర్యలు పెద్ద మార్పు ను తీసుకువస్తాయని నిరూపితమైంది.కన్నాపూర్ గ్రామ ప్రజలు ఈ సహాయాన్ని చూసి పాలకులపై నమ్మకం పెంచుకున్నారు. సర్పంచ్ గొల్ల మహేష్ నాయకత్వం వర్థిల్లాలి అని నినాదాలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రామారెడ్డి మండలంలో మరిన్ని ఆశలను నింపుతున్నాయని ఆశభావం వ్వక్తం చేశారు.


