– మాజీ సర్పంచ్ రాజ నర్సు ఆర్థిక సహాయం
కామారెడ్డి, 02జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్ నర్సింలు తల్లి ఆకస్మికంగా మరణించడంతో కుటుంబం దిగ్భ్రాం తి చెందారు.నిరుపేద కుటుంబానికి మాజీ సర్పంచ్ రాజనర్సు వెంటనే రూ.2,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ మానవతా దృక్పధం గ్రామంలో మంచి సందేశాన్ని పంచింది.మాజీ సర్పంచ్ సానుభూతి రాజనర్సు కుటుంబాన్ని సందర్శించి తక్షణమే రూ.2,000 నగదును అందజేశారు.గ్రామ పంచా యతీ వర్కర్ గా కృషి చేస్తున్న నర్సింలు కుటుం బం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసి ఆయన సహాయం చేశారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చర్యలు పెద్ద మార్పును తీసుకు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.గ్రామంలో కన్నాపూర్ గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ సేవలను అభినందించారు.ఇటీవల ఇక్కడ జీపీ వర్కర్ కుటుంబానికి పంచాయతీ పాలకులు ఆర్థిక సహా యం చేసిన సందర్భం గుర్తుచేశారు. ఈ సహాయా లు రామారెడ్డి మండలంలో సంక్షేమ భావనను పెంచుతున్నాయని పలువురు అభిప్రాయాలు తెలుపుతున్నారు.


