నిర్మల్ జిల్లా: (పున్నమి ప్రతినిధి):- రోజులపాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ సైతం పూర్తిస్థాయి సిబ్బందితో ఎలాంటి ఆపత్కర పరిస్థితులు ఎదురైనా మేమున్నాం అనే భరోసాను కల్పించేలా ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడు సిద్ధం అనే నినాదంతో.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఉండగా ఏర్పడిన బృందమే పోలీసులలో శివంగి బృందం. పోలీసులు ఎలాంటి సమయంలోనైనా ప్రజలకు ధైర్యాన్ని కల్పించడంతోపాటు, ఆత్మవిశ్వాసంతో కూడిన సహాయక చర్యలు చేపట్టడంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు కానీ.. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మరో అడుగు ముందుకేసి నిర్మల్ జిల్లా మహిళా ప్రత్యేక బృందంతో శివంగి అనే పేరుతో ఒక బృందాన్ని సిద్ధం చేశారు. ఆపత్కాల పరిస్థితుల్లో ఈ శివంగి బృందం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొద్దికాలం క్రితమే ఈ బృందానికి బాసర గోదావరి నదిలో ప్రత్యేక రెస్యూ శిక్షణ ఇవ్వడంతో పాటు, అలల మధ్య గట్టిగా కొట్టే ప్రవాహంలోనూ వారు ధైర్యంగా ప్రాక్టీస్ చేయడంతో పాటు తాడు విసరడం, మునిగిపోయే వారిని పైకి లాగడం, బోట్ల సహాయంతో రక్షణ చేయడం, అత్యవసర సమయంలో ప్రధమ చికిత్స అందించడం వంటి అంశాల్లో వారిని ప్రత్యేక నిపుణులుగా తీర్చి దిద్దారు. అలా వారి అనుభవం వల్ల శివంగి బృందం ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి చేరిపోయారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనే సత్తా ఉన్న మహిళ పోలీస్ బృందం ఈ శివంగి టీం.

కడెం ప్రాజెక్టు వద్దకి చేరుకున్న శివంగి (పోలీస్) బృందం