ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 15 (పున్నమి ప్రతినిధి)
కండలేరు డ్యామ్‌ను తిరుపతిలో కలపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈరోజు మనుబోలు మండలంలో ఉప తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు.
డ్యామ్‌ను తిరుపతిలో కలిపితే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ రైతులు, ప్రజలు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, వేలాది ఎకరాల భూములు బీడుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మార్చకపోతే రాస్తారోకో, ధర్నా వంటి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శీను, బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఇరగరాజు వెంకయ్య పట్నం ప్రతాప్, కార్యకర్తలు పాల్గొన్నారు.


