రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం కండలేరు జలాశయం నుండి సత్యసాయి గంగకాలువద్వారా చెన్నైకి సోమవారం ఉదయం 10 గంటలకు నీటిని ఎస్.ఇ హరినారాయణ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసినారు ఈ సందర్భంగా ఎస్.ఇ హరినారాయణ రెడ్డి మాట్లాడుతు చెన్నై త్రాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాము మరల రేపు 500 క్యూసెక్కులు చొప్పున దపదపాలుగా 1200 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తామని తెలుపుతూ ఇది వరకే 7.58 టీఎంసీలు ఇచ్చి ఉన్నాము. ఈ సంవత్సరానికి 1.5 టీఎంసీలు ఇవ్వవలసి ఉన్నది.మొత్తం జలాశయం లో 26 టీఎంసీలు నిల్వ ఉండగా ఇందులో 8.4 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కు పోగా,7.5 టీఎంసీలు ఉపయోగించు కోవచ్చు.7.5 టీఎంసీల లో తిరుపతి, వెంకటగిరి, రాపూరు, గూడూరు వివిధ ప్రాంతాల త్రాగునీటికోసం 3.5 టీఎంసీలు నిల్వ ఉంచగా,చెన్నైకి వచ్చే సంవత్సరానికి 3 టీఎంసీలు కేటాయించడం జరిగింది, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాకు 3.5 టీఎంసీలు కేటాయించగా స్వర్ణముఖి పరిసర ప్రాంతాల ప్రజలకు త్రాగు నీటి కోసం 1 టీఎంసీ,పరిశ్రమలకు 1.5 టీఎంసీలు కేటాయించడం జరిగింది మరియు ఇతర అవసరాల కోసం 3 టీఎంసీలు పోగా 3 టీఎంసీలు నీరు నిల్వ ఉంటాయి అని తలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఇ హరినారాయణ రెడ్డి , ఈ ఈ .విజయ్ కుమార్,డి ఈ. రమణయ్య, ఏ ఈ .కె.తిరుమలరావు , సుబ్బారావు సైట్ ఇంజినీర్ పాల్గొన్నారు