ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి)
ఓటు చోరీకి నిరసనగా ఎఐసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి పార్టీ నేతలు కొవ్వొత్తులతో జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు
ర్యాలీ అనంతరం డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారుమాట్లాడుతూ
ఓటరు జాబితా అడిగితే రాహుల్ గాంధీ పై పోలీసు కేసులు పెడుతు దేశంలో బిజెపి నియంత పాలన,ప్రజాస్వామ్యం పై దాడిచేస్తుందని ఆరోపించారు.బతికి ఉన్నవారిని చనిపోయినట్లుగా, ఉన్న ఓటర్లను లేనట్లుగా చూపిన ఓటరు లిస్ట్ పై సమగ్ర దర్యాప్తు జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలియచేస్తు ,ఎన్నికల కమిషన్ వ్యవహారం, కేంద్ర ప్రభుత్వ వైఖరి పై వాస్తవాలు వివరించేందుకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే ఓటు హక్కును, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అని డిప్యూటీ సీఎంమల్లు బట్టి విక్రమార్క వివరించారు. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి కూటమి ఏదో రకంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచి నియంత పాలన ఈ దేశంలో తీసుకురావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బిజెపి పాలన తీరు ప్రజాస్వామ్యం పై దాడి, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన, రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బిజెపికి లొంగిపోయి వాస్తవాలు బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ దేశంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.
ఈ ర్యాలీ లో జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్
జిల్లా నాయకులు మిక్కిలి నేని నరేంద్ర స్థానిక నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


