Story highlights
- గత ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలి..
- అధికారులకు ప్రజల విజ్ఞప్తి పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు మండలం లో గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్పుల పంపిణీలో ఎదురైన ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లందరికీ సకాలంలో స్లిప్పులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలి.. అధికారులకు ప్రజల విజ్ఞప్తి
పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలం లో గత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్పుల పంపిణీలో ఎదురైన ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లందరికీ సకాలంలో స్లిప్పులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా, పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం నెలకొనకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేలా ఎన్నికల యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News Sources
- Punnami ReportingOwn reporting