ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ బిజినెస్ స్కూల్’ , నేవల్ డాక్‌యార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నేవల్ డాక్‌యార్డ్ పదవీ విరమణ పొందిన సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల కోసం స్థానిక ఎంవీపీ కాలానీలోగల ఐ ఐ ఎ ఎం సెమినార్ హాల్‌లో శుక్రవారం “అవగాహన సదస్సు”
నిర్వహించారు.ఈ సదస్సులో పదవీ విరమణ అనంతరం సమగ్రమైన ఒత్తిడులను ఎదుర్కొనే జీవన సరళిని లక్ష్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబ సంక్షేమం ఆరోగ్యం సంరక్షణ, సామాజిక ఆధ్యాత్మిక పరమైన జీవన విధానం,ప్రశాంతమైన జీవితానికి ఆర్ధిక పరమైన అవగాహన తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఐ ఐ ఎ ఎం డీన్ & సెక్రటరీ డా. ఎస్. పి. రవీంద్ర స్వాగత ప్రసంగం చేస్తూ మానవతా దృక్పథంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన నేవల్ డాక్‌యార్డ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితం ముగిసినా, వ్యక్తిగత అభివృద్ధి, జీవితాంతం,విద్య కొనసాగుతూనే ఉండాలని నొక్కిచెప్పారు.
ముఖ్య అతిథి ఆచార్య వి. బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తన పదవీ విరమణ తదనంతర అనుభవాలు పంచుకుంటూ,
ఆరోగ్య పరిరక్షణతో కూడిన జీవితం సంతృప్తికర దశగా కొనసాగిస్తూ,సామాజిక సేవకు పునరాంకితమవ్వాలన్నారు.
ఆర్ఇఏడి గ్రూప్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వి. కృష్ణ మోహన్ కార్యక్రమ నిర్మాణం, లక్ష్యాలను వివరిస్తూ, పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల వైవిధ్యమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పటిమ, ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, ఆధ్యాత్మిక మైండ్‌ఫుల్‌నెస్ అంశాల్లోని ప్రయోజనాలను వివరించారు.
సీఈవో – ఎస్ డి ఐ ఇమ్తియాజ్ పదవీ విరమణ కొత్త అవకాశాలకు పునాది వేస్తుందన్నారు. సేవా జీవితంలో అనేక పరిమితులు ఉన్నప్పటికీ, పదవీ విరమణ అనేది ముగింపు కాదని,పనితనంలో మార్పు మాత్రమే నన్నారు. వ్యక్తిగత ఆసక్తులు,అభిరుచులు అన్వేషించాలని, విశాఖపట్నం వేగంగా అభివృద్ధిచెందుతున్నదనీ, విభిన్న రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయనీ తెలిపారు.
గౌరవ అతిథి కెప్టెన్ ఆర్. ఆర్. కె. మూర్తి (రిటైర్డ్) తన నౌకాదళ అనుభవాలను పంచుకుంటూ, పదవీ విరమనంతరం ఆర్థిక భద్రత కోసం కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక అవసరమన్నారు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం నడక, వ్యాయామం చేయాలని సూచించారు. ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీనివాస్ పొతిరెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం స్టార్ట్-అప్స్‌లో పెట్టుబడులు దిశగా అలోచించాల న్నారు. ఉద్యోగానంతర జీవితం — గుర్తింపు, లక్ష్యం” అనే అంశంపై
డా. సుశ్మిత గజులా (సైకాలజిస్ట్),
మాట్లాడుతూ భావోద్వేగ, మానసిక మార్పులను, స్వీయ గుర్తింపు ఆర్థిక శ్రేయస్సు ముఖ్య మన్నారు. కమాండర్ వి.ఎస్.సి. రావు (బ్యాంక్ ఆఫ్ బరోడా), తేజ పెన్షన్ నిర్వహణ, పెట్టుబడులు, డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ మోసాల నుండి రక్షణ వంటి ముఖ్య విషయాలను చర్చించారు. డా. నీరజ వెటరన్స్,జీవిత భాగస్వాముల ఆరోగ్యం- పై ప్రసంగిస్తూ వైద్యం, మానసిక ఆరోగ్యం, వెటరన్స్‌కు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వివరించగా,
ప్రొఫెసర్ నిమాలి “మైండ్‌ఫుల్‌నెస్, సంబంధాలు & ఆధ్యాత్మిక సమన్వయం,ధ్యానం, శ్వాసాభ్యాసాలు, ఆత్మపరిశీలన వ్యాయామాలు నిర్వహించారు.
ప్రత్యేక అతిథిగా ప్రొఫెసర్ ఏ. నరసింహ రావు, గౌరవ అతిథులుగా గ్రూప్ కెప్టెన్ ఎ. ప్రభాకర్, కె. కుమార్ రాజా (ఎండి, కుమార్ రాజా కన్స్ట్రక్షన్స్) హాజరయ్యారు.
ప్రొఫెసర్ వి. కృష్ణ మోహన్, డా. ఉజ్వల్ కుమార్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ కృష్ణ మోహన్ పదవీ విరమణ ఒక కొత్త ఆరంభమని, వ్యక్తిగత అభివృద్ధి సామాజిక సేవకు ఇది గొప్ప దశ అని పేర్కొన్నారు.
ఐ ఐ ఎ ఎం ఫ్యాకల్టీ డా. ఉమా సుందరి, ఎన్ఐపిఎం సెక్రటరీ
డా.కృష్ణ కుమారి సమన్వయకర్త
లుగా వ్యవహరించారు.

ఐ ఐ ఏ ఎం బిజినెస్ స్కూల్‌లో ఆధ్వర్యంలో నేవల్ డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగులకు అవగాహన సదస్సు”
ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ బిజినెస్ స్కూల్’ , నేవల్ డాక్‌యార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నేవల్ డాక్‌యార్డ్ పదవీ విరమణ పొందిన సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల కోసం స్థానిక ఎంవీపీ కాలానీలోగల ఐ ఐ ఎ ఎం సెమినార్ హాల్‌లో శుక్రవారం “అవగాహన సదస్సు” నిర్వహించారు.ఈ సదస్సులో పదవీ విరమణ అనంతరం సమగ్రమైన ఒత్తిడులను ఎదుర్కొనే జీవన సరళిని లక్ష్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబ సంక్షేమం ఆరోగ్యం సంరక్షణ, సామాజిక ఆధ్యాత్మిక పరమైన జీవన విధానం,ప్రశాంతమైన జీవితానికి ఆర్ధిక పరమైన అవగాహన తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఐ ఐ ఎ ఎం డీన్ & సెక్రటరీ డా. ఎస్. పి. రవీంద్ర స్వాగత ప్రసంగం చేస్తూ మానవతా దృక్పథంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన నేవల్ డాక్‌యార్డ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితం ముగిసినా, వ్యక్తిగత అభివృద్ధి, జీవితాంతం,విద్య కొనసాగుతూనే ఉండాలని నొక్కిచెప్పారు. ముఖ్య అతిథి ఆచార్య వి. బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తన పదవీ విరమణ తదనంతర అనుభవాలు పంచుకుంటూ, ఆరోగ్య పరిరక్షణతో కూడిన జీవితం సంతృప్తికర దశగా కొనసాగిస్తూ,సామాజిక సేవకు పునరాంకితమవ్వాలన్నారు. ఆర్ఇఏడి గ్రూప్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వి. కృష్ణ మోహన్ కార్యక్రమ నిర్మాణం, లక్ష్యాలను వివరిస్తూ, పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల వైవిధ్యమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పటిమ, ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, ఆధ్యాత్మిక మైండ్‌ఫుల్‌నెస్ అంశాల్లోని ప్రయోజనాలను వివరించారు. సీఈవో – ఎస్ డి ఐ ఇమ్తియాజ్ పదవీ విరమణ కొత్త అవకాశాలకు పునాది వేస్తుందన్నారు. సేవా జీవితంలో అనేక పరిమితులు ఉన్నప్పటికీ, పదవీ విరమణ అనేది ముగింపు కాదని,పనితనంలో మార్పు మాత్రమే నన్నారు. వ్యక్తిగత ఆసక్తులు,అభిరుచులు అన్వేషించాలని, విశాఖపట్నం వేగంగా అభివృద్ధిచెందుతున్నదనీ, విభిన్న రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయనీ తెలిపారు. గౌరవ అతిథి కెప్టెన్ ఆర్. ఆర్. కె. మూర్తి (రిటైర్డ్) తన నౌకాదళ అనుభవాలను పంచుకుంటూ, పదవీ విరమనంతరం ఆర్థిక భద్రత కోసం కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక అవసరమన్నారు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం నడక, వ్యాయామం చేయాలని సూచించారు. ప్రత్యేక ఆహ్వానితుడు శ్రీనివాస్ పొతిరెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం స్టార్ట్-అప్స్‌లో పెట్టుబడులు దిశగా అలోచించాల న్నారు. ఉద్యోగానంతర జీవితం — గుర్తింపు, లక్ష్యం” అనే అంశంపై డా. సుశ్మిత గజులా (సైకాలజిస్ట్), మాట్లాడుతూ భావోద్వేగ, మానసిక మార్పులను, స్వీయ గుర్తింపు ఆర్థిక శ్రేయస్సు ముఖ్య మన్నారు. కమాండర్ వి.ఎస్.సి. రావు (బ్యాంక్ ఆఫ్ బరోడా), తేజ పెన్షన్ నిర్వహణ, పెట్టుబడులు, డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ మోసాల నుండి రక్షణ వంటి ముఖ్య విషయాలను చర్చించారు. డా. నీరజ వెటరన్స్,జీవిత భాగస్వాముల ఆరోగ్యం- పై ప్రసంగిస్తూ వైద్యం, మానసిక ఆరోగ్యం, వెటరన్స్‌కు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వివరించగా, ప్రొఫెసర్ నిమాలి “మైండ్‌ఫుల్‌నెస్, సంబంధాలు & ఆధ్యాత్మిక సమన్వయం,ధ్యానం, శ్వాసాభ్యాసాలు, ఆత్మపరిశీలన వ్యాయామాలు నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా ప్రొఫెసర్ ఏ. నరసింహ రావు, గౌరవ అతిథులుగా గ్రూప్ కెప్టెన్ ఎ. ప్రభాకర్, కె. కుమార్ రాజా (ఎండి, కుమార్ రాజా కన్స్ట్రక్షన్స్) హాజరయ్యారు. ప్రొఫెసర్ వి. కృష్ణ మోహన్, డా. ఉజ్వల్ కుమార్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ కృష్ణ మోహన్ పదవీ విరమణ ఒక కొత్త ఆరంభమని, వ్యక్తిగత అభివృద్ధి సామాజిక సేవకు ఇది గొప్ప దశ అని పేర్కొన్నారు. ఐ ఐ ఎ ఎం ఫ్యాకల్టీ డా. ఉమా సుందరి, ఎన్ఐపిఎం సెక్రటరీ డా.కృష్ణ కుమారి సమన్వయకర్త లుగా వ్యవహరించారు.

