ఏర్పేడు, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ తిరుపతి (ఏర్పేడు) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న యువతకు ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి M.Tech (కెమికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) లేదా M.Sc (కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ తిరుపతి అధికారిక వెబ్‌సైట్ https://www.iittp.ac.in/Project_Positions ను సందర్శించి, ప్రాజెక్ట్ పొజిషన్స్ విభాగంలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వయస్సు, ఎంపిక విధానం, పారితోషికం వంటి పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఏర్పేడు ఐఐటీలో పరిశోధన చేసే సువర్ణావకాశం-జేఆర్ఎఫ్ (JRF) భర్తీకి నోటిఫికేషన్