భీమవరం : మెగా డీఎస్సీలో భీమవరం నుంచి శిక్షణ పొంది 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ ఉపయోగించుకుని 108 మందిప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వివిధ కేటగిరీల వారిగా 1,2,3,4,6,8వ ర్యాంక్ లతో విజయభేరీ మ్రోగించడం హర్షించదగ్గ విషయమని, ఇటువంటి అద్భుతమైన విజయాలతో బోధన అందించిన శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ వారిని అభినందించారు. శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ చైర్మన్ గుడిసె కనకయ్య, డైరెక్టర్ గుడిసె రాము మాట్లాడుతూ జిల్లా టాప్ ర్యాంకు లతో 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ శ్రీవిజేత ఇనిస్టిట్యూట్ అని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

ఏపీ మెగా డీఎస్సీ లో 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషం