పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం…. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లో ఈ నెల 10, 11వ తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న టెక్రియా 2కె245 కార్యక్రమాలు అలరించనున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రాత్రి ప్రాంగణంలోని గ్రంధాలయం వద్ద ఏర్పాటుచేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు చేస్తూ సమాజహిత పరిశోధనలపై దృష్టిసారించాలని వివరించారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా విద్యార్థులు నృత్యాలు చేయడంతోపాటు తమ ఆటపాటలతో చూపరులను మైమరిపించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కే.హిమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ శీనివాసన్, ఆచార్యులు డాక్టర్ టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టెక్రియా కార్యక్రమాలు..
ఈ నెల 10,11న నిర్వహించనున్న టెక్రియా కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, అల్టిమేట్ డ్రోన్, డ్రోన్ చాలెంజ్,సెరెనిటీ రూమ్, ఇంజనీర్స్ డ్రైవ్ వే, రిథమ్ రియాల్టీ, షేర్ లాక్డ్, షార్ట్ ఫిలిం, గైరో మేజ్ ఛాలెంజ్, డిస్ ఎక్స్ట్రీమ్, టెక్ ఎక్స్పో, ఎరిస్, మెటీరియల్ మైండ్స్ పోస్టర్ షో కేస్, కాస్ ఏ థాన్, డ్రోన్ వర్క్ షాప్, హోవర్ నోవ, నేచర్ హంట్, బింగో బ్లోసమ్, కెరీర్ గ్యాలరీ, షూట్ ద వరల్డ్, టిక్ ఆర్కేడ్, విజనరీ, ఎఫ్ 1 ద రేస్, స్టార్ట్ అప్ ఎస్కేప్ రూమ్, ఇన్నోవేషన్ ఎక్సహిబిట్, సాయంత్రం సాంస్కృత కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఏపీ నిట్ లో ఈ నెల 10, 11వ తేదీల్లో అలరించనున్న టెక్రియా 2కె25 కార్యక్రమాలు
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం…. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్)లో ఈ నెల 10, 11వ తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న టెక్రియా 2కె245 కార్యక్రమాలు అలరించనున్నాయి. దీనిలో భాగంగా బుధవారం రాత్రి ప్రాంగణంలోని గ్రంధాలయం వద్ద ఏర్పాటుచేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు చేస్తూ సమాజహిత పరిశోధనలపై దృష్టిసారించాలని వివరించారు. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా విద్యార్థులు నృత్యాలు చేయడంతోపాటు తమ ఆటపాటలతో చూపరులను మైమరిపించారు. ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కే.హిమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ శీనివాసన్, ఆచార్యులు డాక్టర్ టి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. టెక్రియా కార్యక్రమాలు.. ఈ నెల 10,11న నిర్వహించనున్న టెక్రియా కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, అల్టిమేట్ డ్రోన్, డ్రోన్ చాలెంజ్,సెరెనిటీ రూమ్, ఇంజనీర్స్ డ్రైవ్ వే, రిథమ్ రియాల్టీ, షేర్ లాక్డ్, షార్ట్ ఫిలిం, గైరో మేజ్ ఛాలెంజ్, డిస్ ఎక్స్ట్రీమ్, టెక్ ఎక్స్పో, ఎరిస్, మెటీరియల్ మైండ్స్ పోస్టర్ షో కేస్, కాస్ ఏ థాన్, డ్రోన్ వర్క్ షాప్, హోవర్ నోవ, నేచర్ హంట్, బింగో బ్లోసమ్, కెరీర్ గ్యాలరీ, షూట్ ద వరల్డ్, టిక్ ఆర్కేడ్, విజనరీ, ఎఫ్ 1 ద రేస్, స్టార్ట్ అప్ ఎస్కేప్ రూమ్, ఇన్నోవేషన్ ఎక్సహిబిట్, సాయంత్రం సాంస్కృత కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

