ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు పర్సనల్ అధికారి తెలిపినట్లుగా ఒక దిన పత్రికలో వార్త ప్రచురితం కావడం జరిగిందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. పర్సనల్ అధికారి ఎలాంటి ప్రకటనను జారీ చేయలేదని, కావున ప్రజలు, నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి