संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

ఏటికొప్పాకలో కూటమి ఎన్నికల ప్రచార జోరు.. అభ్యర్థులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మద్దతు!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఏటికొప్పాకలో కూటమి ఎన్నికల ప్రచార జోరు.. అభ్యర్థులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మద్దతు!

खबर की मुख्य बातें

  • ఏటికొప్పాక గ్రామంలో సోమవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం తరఫున ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.
  • ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముందుగా గ్రామ దేవత శ్రీ బండిమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా దండం పెట్టుకున్నారు.
  • అనంతరం అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఏటికొప్పాక గ్రామంలో సోమవారం సాయంత్రం కూటమి ప్రభుత్వం తరఫున ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ముందుగా గ్రామ దేవత శ్రీ బండిమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా దండం పెట్టుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ-1 అభ్యర్థి రాయి నాగేశ్వరరావు, ఎంపీటీసీ-2 అభ్యర్థి అన్నం స్వరజీరావు, జడ్పీటీసీ అభ్యర్థి రావి చలపతి, ఎంపీపీ అభ్యర్థి ఇతంశెట్టి శ్రీలక్ష్మికి మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామంలో ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

समाचार स्रोत

  • కె. ఆనంద్प्रकाशन / वेबसाइट

Leave a comment

Your email address will not be published. Required fields are marked *