खबर की मुख्य बातें
- ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.
- ఎం.
- జగన్నాథపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు 30కి పైగా కుటుంబాలతో జనసేన పార్టీలో చేరారు.
ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఎం. జగన్నాథపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు 30కి పైగా కుటుంబాలతో జనసేన పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీ రావి రామలక్ష్మి, శోభన్‌బాబు, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు పైల రాంబాబు, మాజీ సర్పంచ్ పైల మాణిక్యం కుమారులు, మాజీ వార్డు సభ్యులు, పలువురు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకున్నారు. అచ్యుతాపురం మండలంలో వైసీపీ నుంచి జనసేన వైపు నాయకులు, కార్యకర్తలు అడుగులు వేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నివాసం వద్ద జరిగిన ఈ చేరికల కార్యక్రమంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
समाचार स्रोत
- కె. ఆనంద్प्रकाशन / वेबसाइट