संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు.. డీఎస్పీ మోహనరావు హెచ్చరిక

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు.. డీఎస్పీ మోహనరావు హెచ్చరిక

खबर की मुख्य बातें

  • యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పరవాడ డీఎస్పీ మోహనరావు స్పష్టం చేశారు.
  • ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో పాటు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
  • రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పరవాడ డీఎస్పీ మోహనరావు స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో పాటు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ వ్యవహరించరాదని సూచించారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

समाचार स्रोत

  • కె. ఆనంద్प्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *